
*డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్స్ నందు అరుదైన ఆపరేషన్*
(మిర్యాలగూడ, ప్రజాలహరి). నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన వెంకన్న అనే వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో మిర్యాలగూడ లోని డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ నందు శుక్రవారం అడ్మిట్ అయ్యారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & లేప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో కడుపు నొప్పి బాధపడుతున్న వెంకన్న కు పరీక్షణాంతరం ఆపరేషన్ చేయాలి అని సూచించారు, వెంకన్న బంధువులు అంగీకారం మేరకు ఆపరేషన్ చేసి 50 సెంటీమీటర్లు పొడవైన కుళ్లిన పేగును తీసివేసి మరల జాయింట్ వేసి వెంకన్నకు పడుతున్న ఇబ్బందుల నుంచి కాపాడారు.