ఈనెల 30వ తేదీన ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి మహా పుణ్యక్షేత్రంలో జరుగు పంచాంగ శ్రవణానికి విచ్చేయుచున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి…. శ్రీ విశ్వా వసు నామ సంవత్సర పంచాంగ శ్రవణ వివరాలను మంత్రికి తెలియజేస్తున్న దేవస్థానం చైర్మన్ మట్టపల్లి చెన్నూరు మట్టపల్లి రావు, చెన్నూరు విజయ్ కుమార్ లు

మిర్యాలగూడ ప్రజాలహరి….ఈనెల 30న ఉగాది పర్వదినo పురస్కరించుకొని శ్రీ విశ్వా వసు నామ సంవత్సర పంచాంగ శ్రవణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మహా పుణ్యక్షేత్రం కు విచ్చేయుచున్న సందర్భంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనువంశిక చైర్మన్ చెన్నూరు మట్టపల్లి రావు, చెన్నూరు విజయకుమార్ మంత్రి గారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు మంత్రికి వివరించారు.