
మిర్యాలగూడ ప్రజాలహరి….షడ్రుచుల కలయిక మాదిరిగానే బ్రాహ్మణ బంధు సోదరులు ఐక్యంగా ఉండాలని మిర్యాలగూడ పట్టణంలో జరిగిన శ్రీ విశ్వ వసు నామ పంచాంగ ఆవిష్కరణ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు . ఈరోజు స్థానిక శివాలయంలో అర్చక పురోహిత సమైక్య మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ విశ్వ వసు సంవత్సరం పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమo జరిగింది. ముఖ్య అతిథులు జిల్లా వైదిక బ్రాహ్మణ సంగం అధ్యక్షులు గుదే లక్ష్మి నరసయ్య శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ సోదరులు సమిష్టిగా ఉంటూ మన సంఘంలో వెనుకబడిన వారికి చేయూతని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బ్రాహ్మణ అఫీషియల్ & ప్రొఫెషనల్ జిల్లా అధ్యక్షులు రాయప్రోలు మురళీమోహన్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలు బ్రాహ్మణ బంధువులకు అందేలా చూస్తామని సందర్భంగా చెప్పారు. ధూప దీప నైవేద్యం అర్చక సంఘం జిల్లా అధ్యక్షులు పైడిమర్రి ప్రసాద్ శర్మ మాట్లాడుతూ పంచాంగ ప్రాముఖ్యత గూర్చి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందని అన్నారు. మిర్యాలగూడ వినాయక సేవా సమితి అధ్యక్షులు కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తన వంతుకృషి చేస్తానన్నారు. మిర్యాలగూడ బ్రాహ్మణ అఫీషియల్ ప్రొఫెషనల్ సంఘం అధ్యక్షులు బోయినపల్లి వెంకటరమణారావు మాట్లాడుతూ సంఘ సభ్యుల సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ దూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు చిట్యాల శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ సభ్యులు సంఘటితంగా ఉంటూ సంఘ ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేయాలన్నారు. మిర్యాలగూడ పద్యనాటక కళాకారుల సమైక్య అధ్యక్షులు పులి కృష్ణమూర్తి మాట్లాడుతూ సంఘ సభ్యులు, నాయకుల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ అందరిని కలుపుకొని ముందు పోతామని చెప్పారు. మిర్యాలగూడ అర్చక పురోహిత సమాఖ్య సంధానకర్త కురుమేటి రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ గత 2018 నుంచి 2025 వరకు పలు సేవా కార్యక్రమాలు చేశామని పలువురు పేద బ్రాహ్మల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. మరియు కరోనా సమయంలో కూడా సహాయ సహకారాలు అందించామని పేర్కొన్నారు. పలు దుర్గ, రుద్ర సహిత హోమ యజ్ఞ కత్రువులు కూడా నిర్వహించామని అదే విధంగా జగద్గురు ఆది శంకరాచార్యులు జయంతోత్సవాలను కూడా నిర్వహించమని వివరించారు. పంచాంగ ఆవిష్కరణ అనంతరం సభకు ముఖ్య అతిథులుగా వచ్చిన వారందరికీ శాలువాలతో సన్మానం, శ్రీ గాయత్రి దేవి అమ్మవారి చిత్రపట బహుకరణలు చేశారు. ఈ కార్యక్రమంలో శివాలయం అర్చకులు ఉమా శర్మ , శ్రీఆంజనేయ స్వామి దేవాలయం శ్రీ చరణ్ ఆచార్యులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చక పురోహిత సమాఖ్య సభ్యులు భైరవట్ట లక్ష్మీనారాయణ శర్మ, నాగేందర్ శర్మ, అనంతకృష్ణ శర్మ ,శంకర శర్మ, యశ్వంత్ శర్మ, జగదీష్ శర్మ, రామ్మోహన్ శర్మ, మహేష్ శర్మ, సతీష్ శర్మ, శబరినాద్ శర్మ ,భవనారాయణ శర్మ, పుల్లభట్ల లక్ష్మీనారాయణ శర్మ, పూర్ణానంద శర్మ,సుబ్రహ్మణ్య శర్మ, చిట్యాల వెంకటరమణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.