
మిర్యాలగూడ ప్రజాలహరి..ఈరోజు మిర్యాలగూడలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో విద్యుత్ శాఖ అధికారులు, రైస్ మిల్లర్స్ తో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల *లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే *బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..
రైస్ ఇండస్ట్రీ కోసం ప్రత్యేక విద్యుత్ లైన్ కోసం అసెంబ్లీలో చర్చించడంతో ప్రభుత్వం స్పందించింది..
*సమస్య పరిష్కరించేందుకు విద్యుత్ అధికారులైన CE,SE,DE రైస్ మిల్లర్స్ భవనంలో సమావేశం ఏర్పాటు చేయడం సంతోషం..*
గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను..
ఈ ప్రాంతంలో ఎక్కువ రైస్ మిల్లులు ఏర్పాటు చేయడంతో విద్యుత్ వినియోగం పెరిగింది…
*విద్యుత్ వినియోగానికి తగినట్లుగా ఇండస్ట్రియల్ కోసం ప్రత్యేక ఫీడర్, వాణిజ్య గృహ అవసరాల నిమిత్తం మరొక ఫీడర్ ఏర్పాటు చేయాలని కోరాను..*
*నేను మాట్లాడిన మాటలను అవగాహన రాహిత్యంతో ప్రతిపక్షాలు వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయి..*
మిర్యాలగూడ నియోజకవర్గానికి వివిధ అవసరాల నిమిత్తం నిత్యం 30 వేల మంది వస్తూ ఉంటారు..
దానిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి విద్యుత్ అంతరాయం తలెత్తకుండా వేరువేరు విద్యుత్ లైన్లో అడిగాను..
*కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నియోజకవర్గంలో ఎక్కడ కూడా విద్యుత్ సమస్య తలెత్తలేదు..*
*రైతులు , ప్రజలు విద్యుత్ సమస్య ఉందని ఎక్కడా రోడ్ ఎక్కలేదు అన్నారు..*
రాబోయే రోజుల్లో విద్యుత్ విద్యుత్ అంతరాయం తలెత్తకుండా అధికారులు కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు..
ఆసియాలోని అత్యధికంగా మిర్యాలగూడలో రైస్ మిల్లులు ఉన్నాయి..
చిరు వ్యాపారుల కోసం ఫ్లైఓవర్ క్రింద ఏర్పాటు చేస్తున్నాం మార్కెట్ కు రైస్ మిల్లర్స్ కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.