
*ఫ్లైఓవర్ అండర్ గ్రౌండ్లో అత్యాధునిక మార్కెట్..MLA –
మిర్యాలగూడ, ప్రజాలహరి
మిర్యాలగూడ పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -.. పట్టణంలోని ఫ్లైఓవర్ అండర్ లో ఉన్న కాళీ స్థలాన్ని బైక్స్ పార్కింగ్ మరియు ఫ్రూట్ మరియు వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు చేసి ప్రధాన రహదారి పై ఉన్నటువంటి చిరువ్యపారులను మార్కెట్ కి తరలించే ప్రయత్నంలో భాగంగా *సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో* మరియు *డీఎస్పీ తో* మరియు *MRO , మున్సిపల్ కమిషనర్తో* మరియు ఇతరత అధికారులతో కలసి స్థలాన్ని పరిశీలించారు….
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. హౌసింగ్ బోర్డ్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు ముఖ్యంగా సాగర్ రోడ్లో విపరీతమైన ట్రాఫిక్ పెరిగినందువలన వీధి వ్యాపారులతోపుడు బండ్లతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పడం లేదు
తోపుడుబండ్ల వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, ఫ్లైఓవర్ కింద అన్ని సౌకర్యాలతో ప్రత్యన్న ఏర్పాట్లు చేసేందుకు నిశ్చయించాం.
కొన్ని ఖానాలలో డీసీఎంలు, బొలెరోలు, జెసిబి లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం
మిర్యాలగూడ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలని కోరుతున్నాం
ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేయడమే పనిగా ప్రతిపక్షాలు ఉండటం శోచనీయం
విపరీతంగా పెరిగిన పట్టణ ప్రజల సౌకర్యం కోసం విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలని తాను అసెంబ్లీలో ప్రస్తావించగా, దానిని తప్పుడు ప్రచారం చేయటం ప్రతిపక్ష పార్టీల విజ్ఞతకే వదిలేస్తున్నాం
మిర్యాలగూడ అభివృద్ధి కోసం తమ అనుభవంతో ఎలాంటి సలహాలు ఇచ్చిన పాటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు….
ఈ కార్యక్రమంలో అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు..