
అసెంబ్లీలో వర్గీకరణ ఆమోదించినందుకు పాలాభిషేకం
వేములపల్లి( ప్రజాలహరి) రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించినందుకుగాను నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చిత్రపటాలకు బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు మాలికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలు మాదిగల హక్కుల కోసం పోరాడినటువంటి పోరాటాన్ని గత ఏడు మాసాల క్రితం సుప్రీంకోర్టులో తీపి ఇవ్వడం జరిగింది. అట్టి తీర్పును దృష్టిలో పెట్టుకొని నిన్న అనగా మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అఖిలపక్షంతో మాట్లాడి ఎస్సీ వర్గీకరణ ఆమోదించడం జరిగింది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి మాజీ ప్రజాప్రతినిధులు వెంకట్ రవీందర్ రెడ్డి, గంజి శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, బుసిరెడ్డి వెంకటరెడ్డి, పల్ల వెంకన్న గౌడ్, గౌర రమేష్, బొంత పుల్లయ్య, దైద వెంకటేశ్వర్లు, ది వినోద్, వెంకట్ రెడ్డి, పుట్టల సుధాకర్, దైదప్రసాద్, వేములపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు మహేష్, విజయ రెడ్డి, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు