
వేగం కన్నా ప్రాణం మిన్న
రోడ్డు ప్రమాదాల నివారణ సదస్సులో ఎస్పి
వేములపల్లి ప్రజాలహరి
వేగం కన్నా ప్రాణం మిన్న అని అతివేగం ప్రమాదకరమని ఎస్పీ శరత్ చంద్రకుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో మిషన్ రోడ్ సేఫ్టీ, రూల్స్, రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గమ్యాన్ని చేరాలన్న ఆత్రుతలో వాహనదారులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, అతివేగం ప్రమాదకరమన్నారు. ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, రోడ్డు దాటడం చేయకూడదన్నారు. ప్రమాదాలపై స్థానికంగా ఉన్న ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.అనంతరం రోడ్డు సేఫ్టీ కమిటీని నియమించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రాజశేఖర్ రాజు సిఐలు పిఎన్డి ప్రసాద్, ఎస్సైలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.