
ఆటోను వెనక నుండి ఢీ కొట్టిన లారీ ఒకరి మృతి
మిర్యాలగూడ ప్రజాలహరి
ఆటోను వెనుక నుండి లారీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ రూరల్ పరిధిలో గల సాంబశివ రైస్ మిల్లు సమీపంలో శ్రీనివాస్ నగర్ వద్ద మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన కాటం ఆంజనేయులు తన ఆటోలో లారీ అసోసియేషన్ ఆఫీస్ వద్ద ప్రయాణికుడైన కృష్ణకుమార్ ను ఎక్కించుకొని తన ఆటోలో ధీరావత్ తండా ఎక్స్ రోడ్డు వద్ద ఆటోని ఆపగా,అదే సమయంలో వెనుక నుండి వస్తున్న లారీ ఆటోను వెనుక భాగంలో ఢీకొట్టగా ఆటో బోల్తా పడటంతో ఆటోలో ప్రయాణికుడు కృష్ణకుమార్(బీహార్ రాష్ట్రం) అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ మరియు అతని కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలు అవటంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు ప్రారంభించినట్లు రూరల్ ఎస్సై తెలిపారు.