
మిర్యాలగూడ ప్రజా లహరి , మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నందు గుర్తింపు పొందిన అన్నీ రాజకీయ పార్టీల అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.
ఇట్టి సమావేశంలో రోజు వారీగా ఆన్లైన్ ద్వారా నమోదు అవుతున్న ఫామ్-6,7&8 ల పరిష్కారం మరియు డూప్లికేట్ ఓటర్ల తొలగింపు మరియు నూతన ఓటర్ల నమోదు మరియు బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం ఎన్నికలకు సంబందించిన తదితర అంశాలపై సమావేశం లో చర్చించి హాజరైన వారి యొక్క సూచనలు మరియు సలహాలు పరిగణలోకి తీసుకొని తగు చర్యలు గైకొననున్నట్లు తెలియజేశారు.