
దేవాలయ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తా
జాయింట్ కలెక్టర్ అమిత్
వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని అవనిగల్ గ్రామంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయానికి నా వంతుగా కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. బుధవారం రామలింగేశ్వర స్వామి జాతర పురస్కరించుకొని అవనిగల్ గ్రామంలో ఎడ్ల పందాలను, కబడ్డీ లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలు వచ్చిపోయే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని ఆయన దేవాలయ కమిటీ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు కు, కమిటీ సభ్యులకు సూచించారు. ముఖ్యంగా ఈ ఆలయంలో మూడు రోజులు పాటు నిర్వహించే జాతరలో భక్తులకు మంచినీటి సమస్య, క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత కమిటీ సభ్యులు తీసుకోవాలని ఆయన కోరారు. ఇట్టి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండాలని ఆయన పోలీసులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మండల తాసిల్దార్ పుష్పలత, ఎస్సై డి వెంకటేశ్వర్లు, కమిటీ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కమిటీ బృందం పాల్గొన్నారు