
సామాజిక న్యాయాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ
సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుసిరెడ్డి
వేములపల్లి( ప్రజాలహరి) కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సామాజిక న్యాయాన్ని చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుస్తాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్సీ స్థానాలను ఎంపిక చేయటంలో ఎస్సీ, ఎస్టి, బిసి అన్ని వర్గాలకు న్యాయం చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాలను ఎంపిక చేసిందని ఆయన కొనియాడారు. ముఖ్యంగా నల్గొండ పార్లమెంటు పరిధిలో మిర్యాలగూడ నియోజకవర్గం లోని ఒక సామాజిక వర్గ ఎస్టీ నాయకుడైన కేశవత్ శంకర్ నాయక్ ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో బాణాసంచాలు పేల్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పళ్ళ వెంకటయ్య, బొంత పుల్లయ్య, సుధాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పెద్ద మామ చింటూ తదితరులు పాల్గొన్నారు.