Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ లో డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ,మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు

Post top
home side top

మిర్యాలగూడలో ప్రముఖడాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ సేవలు ప్రారంభం

మిర్యాలగూడ ప్రజాలహరి.

హైదరాబాద్ లో జరిగే అధునాతన వైద్యం  మిర్యాలగూడలో లభించడం  చాలా ఆనందంగా ఉందనీ మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల   లక్ష్మారెడ్డి అన్నారు. కార్పొరేట్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని ఫీజులు విషయంలో  చూసి తీసుకోవాలని కోరారు.

మిర్యాలగూడ పట్టణంలో మునుపెన్నడూ లేని విధంగా అధునాతన టెక్నాలజీతో డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ ను శనివారం రోజు ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ల తో పాటు డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మరియు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు లు మాట్లాడుతూ గతంలో వచ్చిన అన్ని మల్టీ హాస్పిటల్ లా గా కాకుండా ప్రజలకు తక్కువ ఖర్చుతో అత్యధిక వైద్యాన్ని అందించాలి అనే ఆలోచనతో ఇప్పుడు వచ్చినటువంటి డాక్టర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో అత్యాధునిక సేవలు, తక్కువ ఖర్చుతో అందిస్తూ మారుమూల పల్లెలకు ప్రజలకు కూడా నాణ్యమైన సేవలను అందించి మన మిర్యాలగూడకు మంచి పేరు తీసుకురావాలని కోరారు,

డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ ఈ మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు మాత్రమే జీవిస్తున్నారని వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని, నమ్మకమైన వైద్యం అందిస్తే ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు మీకు ఉంటాయని అన్నారు.

అంజిరెడ్డి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మరియు విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 1977 నుండి మా యొక్క సేవలు పల్నాడు ప్రాంతంలో అందిస్తున్నామని అప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు బ్రాంచ్లు లలో నిరుపేదలకు వైద్యం అందిస్తూ మన్ననలు పొందామని, మిర్యాలగూడ నియోజకవర్గం లోని పేదలకు సేవ చేయడమే మా యొక్క హాస్పిటల్ ప్రధాన ఉద్దేశమని,నాణ్యమైన వైద్యంతో అతి తక్కువ ఖర్చుతో పేదలకు కార్డియాలజీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ ,కోక్లియర్ ఇంప్లాంట్ లాంటి సూపర్ స్పెషాలిటీ వైద్యం తో పాటు ట్రామ క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్,ఆర్థోపెడిక్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, ఇఎన్టి, రేడియాలజీ లాంటి స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.

ప్రముఖ బోన్ మారో స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజాలోకి రెడ్డి మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఈ యొక్క బ్రాంచ్ లో కూడా మంచి సేవలు అందిస్తూ ముందుకు పోవాలని అలాగే ప్రతి ఒక్కరూ డాక్టర్ కోర్స్ తో పాటు డాక్టర్ కు సహాయం అందించే స్టాఫ్ నర్స్, ఈసీజీ లాంటి టెక్నీషియన్ కోర్సులు కూడా నేర్చుకుంటే అందరికీ బాగుంటుందని అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ అంజిరెడ్డి, సుస్మ శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఆర్ లు శ్రవణ్, సత్య, మార్కెటింగ్ మేనేజర్ విజయ్ లతోపాటు ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్, సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం, కెమిస్ట్ మరియు డ్రగ్గిస్టుల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.