
మారు మోగిన శివనామ
హాజరైన ఎమ్మెల్యే దంపతులు
వేములపల్లి( ప్రజాలహరి) శివరాత్రి పండుగను పురస్కరించుకొని వేములపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి కాకతీయులు కాలం నాటి శివాలయంలో బుధవారం తెల్లవారుజామున నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివ నామాన్ని స్మరించుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి దంపతులు హాజరై పూజా కార్యక్రమం పూజారి ఉగ్రదండ హరిప్రసాద్ శర్మ అయ్యగారు ఎమ్మెల్యే దంపతుల పేరుపై అర్చన చేయడం జరిగింది, తర్వాత ఆశీర్వాదం పొందారు. అనంతరం శివాలయ కమిటీ చైర్మన్ పబ్బతి కరుణాకర్, కమిటీ మెంబర్ సాదు నరేందర్ దంపతులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వేములపల్లి శివాలయం కమిటీ చైర్మన్ పబ్బతి కరుణాకర్ వేములపల్లి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో సిసి రోడ్లు లేక భక్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దేవాలయ కమిటీ చైర్మన్ కర్ణాకర్ శాసనసభ్యులు దృష్టికి తీసుకపోగా, అట్టి విషయాన్ని శాసనసభ్యులు తక్షణమే పరిశీలిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు రేగటి మమతా రవీందర్ రెడ్డి, మాలికాంతరెడ్డి, గంజి శ్రీనివాస్, రావు ఎల్లారెడ్డి, పుట్టల కురుపయ్య, తంగెళ్ల సత్తిరెడ్డి, బండి యాదగిరి రెడ్డి,పుట్టల శ్రీనివాస్, నాగవెల్లి కృష్ణ, హాజీ, మహిముద్, తోట మహేష్, అనిల్ రెడ్డి, మాలి శ్రీనివాస్ రెడ్డి, కందిమల్ల యాదగిరి రెడ్డి, బంగర్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు