
మిర్చి కనీస మద్దతు ధర 25 వేలు ప్రకటించాలి. మిర్యాలగూడ ప్రజాలహరి
మిర్చి పంటకు రేటు లేకుండా రైతులకు అన్యాయం చేస్తూ మిర్చి రైతుల కడుపు కొడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు….
మిర్చి రైతులు కన్నెర చేసే రోజులు దగ్గరే ఉన్నాయి…
ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి
మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుసంఘము జాతీయ నాయకులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
ఈ రోజు దామరచర్ల మండలం లో కళ్లేపల్లి, గాంధీనగర్ గ్రామం లో మిర్చి రైతులతో మాట్లాడీ, మిర్చి పంటను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
‘రాష్ట్రంలో రైతులు పండించిన మిర్చికి ధర దారుణంగా పడిపోతున్నది. క్వింటాల్‌కు గత సంవత్సరం రూ25,000 ఉంటున్నా పరిస్థితి నుంచి రూ.12,000లకు తగ్గించి ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు లేకుండా చేస్తున్నారు. ఫలితంగా మిర్చి రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిర్చిమార్కెట్ ఏర్పాటు చేసి మద్దతు ధర నిర్ణయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయడంతో పాటు మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పంటకాలంలో వ్యాపారులు మార్కెట్లల్లో ధరలు తగ్గించడం, రైతుల నుండి సరుకు వ్యాపారులకు చేరిన తర్వాత ధరలను రెట్టింపు చేయడం ప్రతి ఏటా జరుగుతున్నది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో మిరప పంట క్వింటాల్‌కు కనీస మద్ధతు ధర రూ.15,000లు ఇస్తామని ప్రకటించారు. ఒకవైపు వ్యవసాయ ఖర్చులు పెరిగాయి. మరోవైపు దిగుబడులు బాగా తగ్గాయి. ఎకరాకు 30, 40 క్వింటాళ్ళు దిగుబడి రావాల్సి ఉండగా క్రిమీకీటకాల వల్ల ఎకరాకు దిగుబడి 12 క్వింటాళ్ళకు తగ్గింది. రైతులకు ఎకరాకు పెట్టుబడి రూ.1.5లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడులు కూడా రాని స్ధితి ఉంది. దీంతో జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకొని క్వింటాల్‌కు రూ.25 వేలు ధర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ మార్కెట్లలో ప్రభుత్వ నియంత్రణ పెరగాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో మిరపకు మంచి ధర ఉన్నందున వ్యాపారులకు పోటీగా మార్క్‌ఫెడ్ ద్వారా రూ.25 వేలకు క్వింటాల్ కొనుగోలు చేసినప్పటికీ ఎలాంటి నష్టం రాదు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.ఈ కార్యక్రమం లో cpm రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, cpm జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్, వినోద్ నాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్ర్ర నాయక్, citu జిల్లా నాయకులు దయానంద్, రైతులు దీరావత్ మాలు నాయక్, దీరావత్ సైదా, సకృ, మంగ్య, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.