
అభ్యాస్ టెక్నో హైస్కూల్లో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం…
మిర్యాలగూడ, ప్రజాలహరి
స్థానిక సంతోష్ నగర్ నందుగల అబ్యాస్ ‘టెక్నో హైసూర్’లో శనివారం రోజున స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ శ్రీ వంగాల నిరంజన్ రెడ్డి..కరస్పాండెంట్ శ్రీమతి వంగాల పుష్పలత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…విద్యార్థులు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి పలువురిని ఆకట్టుకున్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులలో నైపుణ్యత పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు. RJD గా సృతీఈహరిక, కలెక్టర్ శ్రీజ, DEO రుచిత ప్రిన్సిపల్ గా రావుల సరిత మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా విద్యార్థులు తమ తమ స్థాయిలో విద్యార్థులకు పాఠాలు బోధించి సీనియర్ ఉపాధ్యాయులను సహితం ఆశ్చర్యచకితులను చేసే విధంగా వారు చక్కటి ప్రతిభను కనబరిచినందుకు విద్యార్థులను అభినందిస్తూ వారికి బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎ. పాండురంగ మరియు ఉపాధాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.