
అయ్యా ఎమ్మెల్యే గారు మార్కెట్ చైర్మన్ పదవి ఈసారైనా వేములపల్లి మండలానికి వస్తుందా? లేదా?
వేములపల్లి( ప్రజాలహరి) మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వేములపల్లి మండలానికి కేటాయిస్తారా లేదా అనేది నీటి మీద మాటలానే అయినది. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పడి దాదాపు 50 ఏళ్ళు పైన చైర్మన్ పదవి. వేములపల్లి మండలానికి మాత్రం చైర్మన్ పదవి దక్కలేదు. మిర్యాలగూడ గ్రామపంచాయతీ స్థాయిలో ఉన్నప్పుడే ఈ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పడింది .సుమారు1965 ముందుకు మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసు ప్రస్తుత డాక్టర్ శరత్ బాబు హాస్పటల్ సమీపంలో ఉండే అక్కడ విధులు నిర్వహణ కార్యక్రమం జరిగేది. అక్కడినుంచి షాబు నగర్ లో మార్చబడింది. ఆ ప్రాంతాల్లో రాజగోపాల్ రెడ్డికి చెందిన సీలింగ్ భూమిని వ్యవసాయ మార్కెట్కు బదలాయించడం జరిగింది. ఆయన పేరు మీద మార్కెట్ కమిటీకి రాజగోపాల్ గంజ్ ని ఏర్పాటు చేశారు.. నల్గొండ జిల్లా కమ్యూనిస్టుల కాంగ్రెస్ పార్టీల పోరాటాల పురిటి గడ్డగా పేరుగాంచింది ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీల మధ్యన పోటీ ఎక్కువగా ఉండేది. నకిరేకల్ మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని తోపుచర్ల చిరుమర్తి తో పాటు సల్కునూరు గ్రామాల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్లు మధ్యన పోటా పోటీ గా ఉండేది. అటు కమ్యూనిస్టులను ధైర్యంగా ఎదుర్కొన్న ఆ ప్రాంతానికి మాత్రం మార్కెట్ చైర్మన్ గిరి లభించలేదు. మారిన రాజకీయ సమీకరణాల్లో కమ్యూనిస్టులు తెలుగుదేశం పొత్తులో గాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న మార్కెట్ చైర్మన్ పదవి మాత్రం వేములపల్లి మండలానికి దక్కలేదు .ఆ ప్రాంతo నుంచి నియోజకవర్గ, జిల్లా ఎదిగిన నాయకులు ప్రభుత్వ, నామినేటెడ్ పోస్టులలో లేకపోవడం ఆశ్చర్యకరం. ఈ ప్రాంత నాయకులు గ్రామాల వరకే పరిమితం అవుతున్నారు. నియోజకవర్గస్థాయికి రాలేకపోతున్నారు. ఆ ప్రాంతం నుంచి నాయకత్వం నుంచి తయారు కావడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీలు వేములపల్లి మండలాన్ని కమ్యూనిస్టుల అడ్డగా చూపించుకుంటూ ఓట్లు దండుకుంటూ ఆ ప్రాంతానికి రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధికి సహకరించటం లేదు. ఇప్పటికి ఈ ప్రాంత నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ల వరకే పరిమితం అవుతున్నారు. ఒక్క మారు ఈ మండలానికి చెందిన చిరుమర్రి కృష్ణయ్యకు వైస్ చైర్మన్ గిరి లభించింది………….. . ఇప్పటివరకు మిర్యాలగూడకు చైర్మన్లు చేసిన వారు వీరే…. 1965 ముందు నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్గా కనగల్ గ్రామానికి చెందిన (మిర్యాలగూడ గ్రామంలో నివాసం ఉండడం కారణంగా) వంగాల మాధవరెడ్డి ఎన్నికయ్యారు.చైర్మన్ ఐదు నుంచి ఆరుసార్లు మార్కెట్ చైర్మన్ పనిచేయటం జరిగింది. . ఆ తర్వాత మిర్యాలగూడ వాసుల ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు గౌరు లింగయ్య , కాంగ్రెస్ పార్టీలో బలమైన లీడర్ గా ఉన్న అన్న బీమోజు మదనచారి, ఎలుగుబేల్లి నరసింహ, నామిరెడ్డి మట్టారెడ్డి, నూకల బలరాం రెడ్డి, తెలుగుదేశం నుంచి రామాచారి, కాంగ్రెస్ నుంచి తిరునగర్ గంగాధర్, తిప్పన విజయసింహారెడ్డి, భారత రాష్ట్ర సమితి నుంచి చిట్టి బాబు నాయక్, చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బైరం సంపత్ వీరందరూ మిర్యాలగూడ చైర్మన్ పదవిని చేపట్టిన వారు . వీరంతా మిర్యాలగూడ మిర్యాలగూడ మండలము దామరచర్ల వంత త్రిపురారo మండలం వారే చైర్మన్లు గా చేశారు. ఒక్క పర్యాయం కూడా వేములపల్లి మండలానికి దక్కలేదు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలో కమ్యూనిస్టు కంచుకోటలోలైన కాంగ్రెస్ పార్టీ అలాంటి కంచుకోటని బద్దలు కొట్టి మండలంలో కంచుకోట కాంగ్రెస్ గా నిలదొక్కుతుంది. దీంతో వేములపల్లి మండలం పునర్ విభజన కాకముందు నల్గొండ జిల్లాలో వేములపల్లి మండలం అతి పెద్దదిగా ఉండే అట్టి మండలంలో తోపు చర్ల ఫిర్క కమ్యూనిస్టులతో పోరాటం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఓట్లను చూపించడం జరుగుతుంది. అట్టి మండలంలో గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికిని కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి మనోధైర్యాన్ని చెడకున్న ఒకప్పుడు కమ్యూనిస్టులతో పోరాటం చేసి తిరిగి టీఆర్ఎస్ తో పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి పూర్వం వైభవం తెచ్చింది. 2024 లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మండలంలో సుమారుగా 30,000 పైన ఓట్లు కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు అత్యధిక ఓట్లు మెజార్టీ తెచ్చినటువంటి మండలానికి ఈసారైనా మార్కెట్ చైర్మన్ పదవి దక్కుతుందా? లేదా అనే విషయంపై మండల ప్రజలు ఉత్కంఠంగా వేసి చూస్తున్నారు.
ఏది ఏమైనా అప్పటికిని ఈసారి చైర్మన్ కి ఇవ్వాలి. ఇప్పటికైనా నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు సమాన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఎమ్మెల్యే గారు పై అంశాలను పరిశీలించి ఒక్కమారైన వేములపల్లి మండలానికి చైర్మన్ పదవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో ఇంకా బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.