Ultimate magazine theme for WordPress.

దావోస్ పెట్టుబడుల సమీకరణలో రేవంత్ బిజీ బిజీ

Post top
home side top

ప్రజాలహరి………ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనంత భారీ పెట్టుబడులను సమీకరించింది.

 

దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సంస్థ సన్ పెట్రో కెమికల్స్ (Sun Petrochemicals) తెలంగాణలో రూ.45500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది.

 

🔸 భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సన్ పెట్రో కెమికల్స్ సంస్థ ప్రకటించింది. ముఖ్యమంత్రి , పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీ తో చర్చలు జరిపిన అనంతరం వారి సమక్షంలోనే అధికారులు అవగాహన ఒప్పందంపై (ఎంవోయూ) సంతకాలు చేశారు.

 

🔸 Sun Petrochemicals నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది.

 

🔸 ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3400 మెగావాట్లు. వీటికి 5440 మెగావాట్ల సామర్థ్యముండే సోలార్ విద్యుత్తు ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది.

 

🔸 ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7000 ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటివరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావటం విశేషం.

 

🔸 భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిధులను ముఖ్యమంత్రి గారు అభినందించారు. సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలు రాయిగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు.

 

🔸 హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, సన్ పెట్రో కెమికల్స్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో డిమాండ్ కు అనుగుణంగా ఇంధన వనరులు సమకూరుతాయని సీఎం గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలతో పాటు నాగర్కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందుతాయని అన్నారు.

 

🔸 తమ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, తమ చర్చలు ఫలించాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంత భారీ పెట్టుబడుల ఒప్పందం సాధించటం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు  అన్నారు.

 

🔸 తాము చేపట్టబోయే ప్రాజెక్టు తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని సన్ పెట్రో కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వీ గారు ధీమా వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో తెలంగాణ పెట్టుబడుల గమ్య స్థానంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం గర్వంగా ఉందన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.