మిర్యాలగూడ ప్రజాలహరి…..విశాలమైన ప్రకృతి వడి మధ్యతరగతి వారు సైతం కొనుగోలు చేసే అద్భుతమైన ఉషోదయ వెంచర్ అని ఉషోదయ టౌన్ షిప్ నిర్వాహకులు కర్నాటి విజయ్ కుమార్, దోసపాటి శ్రీనివాస్, ముజ్జా రామకృష్ణారావు, పోలే జనార్దన్లు విలేకరులకు తెలిపారు. ఈరోజు మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్ నగర్ లో దేవరకొండ మిర్యాలగూడ ప్రధాన రహదారి వారగా ఉషోదయ వెంచర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ కు సుమారు 5 కిలోమీటర్లు దూరం ,రైల్వే స్టేషన్ కు మూడు కిలోమీటర్లు దూరంలో ఈ ఉషోదయ టౌన్ షిప్ వెయటం జరిగిందని మూడు పార్కులు ,వాక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ ,అధునాతన సౌకర్యాలతో కూడిన గ్రామ పంచాయతీలు ,ప్రభుత్వ అనుమతులు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. 26 ఎకరాలు ఈ వెంచర్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మధ్యతరగతి కుటుంబాల వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని సదుపాయాలతో జీవించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. విశాలమైన సిమెంట్ రహదారులు, భూగర్భ డ్రైనేజీలు, ప్రతి ప్లాటు వాటర్ సప్లై ఒంటి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రజలు తమను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి చల్లా సోమలింగం, పైడిమర్రి సురేష్, తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.