ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ బెయిల్ కోసం ఫోర్జరీ షూరిటీ పత్రాలు సృష్టించిన నిందితులు అరెస్ట్
మిర్యాలగూడ ప్రజాలహరి క్రైమ్….. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడి సుభాష్ శర్మ బెయిల్ కోసం ఫోర్జరీ షూరిటీ పేపర్లు సృష్టించిన వ్యక్తులు అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలు ఇలా ఉన్నాయి . మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపిన ప్రకారం 2018 సంవత్సరంలో మిర్యాలగూడలోసంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో బీహార్ చెందిన ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ గత ఎనిమిది సంవత్సరాలుగా జైలు జీవితం గడుపుతున్నాడు. ఇటీవల నవంబర్ 2024 లో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు బెయిల్ కోసం సుభాష్ శర్మ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన బెయిల్ విజ్ఞప్తిని పరిశీలించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ని ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మేరకు బెయిల్ పొందడానికి కావలసిన షూరిటీలు కోర్టుకు అందజేసి బెయిల్ పొందవచ్చు అని కోర్టు సూచించింది. ఆ సందర్భంలో కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వంగాల సైదులు బెయిల్ పత్రాలు తయారు చేస్తానని సుభాష్ శర్మకు మాట ఇచ్చారు .మాట ప్రకారం మరో ఇద్దరు స్నేహితులైన పాములపాడు గ్రామానికి చెందిన చింతచెర్ల దేవయ్య, ముక్కామల మల్లేశులతో కలిసి ఆ గ్రామానికి చెందిన గ్రామ కార్యదర్శి పేరిట షూరిటీ పత్రాలను నకిలీ తయారుచేసి నల్గొండ కోర్టుకు సబ్మిట్ చేశారని డిఎస్పి వివరించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ పత్రాలను పరిశీలించాలనీ నల్గొండ జిల్లా ఎస్పీకి పంపించింది. నల్గొండ ఎస్పీ కి ఈ పత్రాలపై అనుమానం కలిగి వేములపల్లి, మాడుగుల పల్లి పోలీస్ స్టేషన్ల ఎస్ఐలకు సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారని డిఎస్పి రాజశేఖర్ రోజు తెలిపారు విచారణలో భాగంగా పాములపాడు గ్రామ కార్యదర్శి మున్నా సైదులుని కలిసి ఈ పత్రాలు చూపించగా సంతకాలు తనవి కావాని నకిలీవని నిర్ధారించారు. సైదులు ఫిర్యాదు మేరకు వంగాల సైదులు, చింతచెర్ల దేవయ్య, ముక్కామల మల్లేశులపై వేములపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ చేసి కోర్టుకు డిమాండ్ చేయడం జరిగిందని డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపారు. మొదటి నిందితుడైన వంగాల సైదులు 2022 సంవత్సరంలో నారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మర్డర్ కేసులో కూడా ఇదేవిధంగా నకిలీ పత్రాలను కోర్టుకు సబ్మిట్ చేశారని అది కూడా విచారణలో ఉన్నదని ఆయన వివరించారు. నిందితులనుంచి రెండు స్మార్ట్ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోను, ఒక కొత్త హోండా యాక్టివా, యూనికాన్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. నల్లగొండ జిల్లాలోనీ కట్టంగూరు, తిప్పర్తి వేములపల్లి ,నల్గొండ టు టౌన్, ఆత్మకూరు, కేతేపల్లి అడ్డగూడూరు ,మోత్కూరు, చందంపేట ,నల్లగొండ వన్ టౌన్, నకిరేకల్ ,శాలిగౌరారం మునుగోడు పోలీస్ స్టేషన్లలో సుమారు 21 కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా డిఎస్పి వివరించారు. మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లను మరియు సిబ్బందిని డిఎస్పి రాజశేఖర్ రాజు అభినందించారు.