పరిపాలన చేతకాక ప్రశ్నించే గొంతులను నొక్కడం సరికాదు
కట్ట మల్లేష్ గౌడ్
వేములపల్లి (ప్రజాలహరి) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేతకాక ప్రశ్నించే గొంతులను నొక్కడం సరికాదని బిఆర్ఎస్ జిల్లా పార్టీ నాయకులు కట్ట మల్లేష్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు వివిధ రకాల మాయ మాటలు చెప్పి, ప్రజలకు 6 గ్యారంటీలను అమలు చేస్తామని నేటి వరకు అమలు చేయకుండా చోద్యం చూడటం సరి కాదని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రజల పక్షాన ప్రజలకు కావలసినటువంటి సమస్యలను మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ అరెస్టు చేయించడం సరికాదని ఆయన తీవ్ర స్థాయిల విమర్శించారు. ప్రజల పక్షాన మాట్లాడినటువంటి వ్యక్తులను అరెస్టు చేయించడం గొప్ప అనుకోవడం సరికాదు కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసి వారి సత్తా నిరూపించుకోవాలని తప్ప ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ఏ ఒక్క గ్యారెంటీ అయినా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. పరిపాలన చేతకాక ఆర్మూలా కేసును బయటకు తేవడం అది వారి విజ్ఞతకే చాలా సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి పేద ప్రజలకు కావలసిన మందులు కి సదుపాయాలను కల్పించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన వెంట గ్రామ శాఖ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ టి ఎస్ సి ఎస్ మాజీ చైర్మన్ ట్రాక్టర్ గడ్డ రాజగోపాల్ రావు, మాజీ ఎంపీటీసీ మజ్జిగపు సుధాకర్ రెడ్డి, ఏసిఎస్ ఉపాధ్యక్షులు పెద్దపంగు సైదులు, నక్క నాగరాజు, నక్క శ్రీధర్, ఏ .కుమార్, ఏం. లింగారెడ్డి, రాంబాబు, బంటు రాము. కట్టా వెంకటయ్య, చంటి, వేణు, జానకి రెడ్డి, సైదులు, చెంచు తదితరులు పాల్గొన్నారు