![home side top](https://i0.wp.com/www.prajalahari.com/wp-content/uploads/2024/12/Adobe-Photoshop-PDF-12-09-2024_12_16_AM.png?w=1170&ssl=1)
*ముదిమాణిక్యంలో ఈనెల 13న జిల్లా స్థాయి ఎడ్ల బల ప్రదర్శన*
మిర్యాలగూడ ప్రజాలహరి
శ్రీ అభయాంజనేయ స్వామి వారి చతుర్ధ వార్షికోత్సవమును పురస్కరించుకుని అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఈనెల 13న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, అన్నదానం, 14న ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటి ధర్మకర్త సూర ప్రసాద్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమానికి ప్రారంభకులు ముఖ్యఅతిథిగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాజరవుతారని తెలిపారు. ఎడ్ల బల ప్రదర్శన విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.25,116 /-లు, ద్వితీయ బహుమతిగా రూ.20,116/-లు, తృతీయ బహుమతిగా రూ.15,116/-లు, చతుర్ధ బహుమతిగా రూ.5,116/-లు అందజేయడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శైవాంగ శతాధిక ప్రతిష్టాచార్య దేవాద్రి కోటేశ్వర శర్మ నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు, హనుమత్ హోమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమాల నిర్వహణకు దాతలు వడ్డెంగుంట విజయ గౌడ్, అడ్వకేట్ పి. సాయికృష్ణ ఆజాద్, కొమ్ము కోటయ్య అండ్ సన్స్, పిల్లి చంద్రయ్య, వేములకొండ సుబ్బారావు, ఆడికె శ్రీనివాస్ వరప్రసాద్, మేకపోతుల సైదయ్య నర్సమ్మ, జె. పోతులూరి బ్రహ్మం, జి. రామాంజి, సూర కోటేశ్వరరావు, సూర శ్రీనివాసరావు, ఏల్చూరి నాగరాజు, ఎం. నాగేశ్వరరావు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో పాల్గొనదలచిన వారు సెల్ నెంబర్: 966658801; 9121943980 లను సంప్రదించాల్సిందిగా కోరారు.