బిజెపి కార్యాలయం పై దాడికి నిరసనగా సాధినేని శ్రీనివాసరావు, తుమ్మలపల్లి హనుమంత రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
భాజపా రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
నీ నిరసిస్తూ మిర్యాలగూడ లో బిజెపి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం, ధర్నా.
మిర్యాలగూడ, ప్రజాలహరి
మిర్యాలగూడ… తెలంగాణ రాష్ట్ర భాజపా కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బుధవారం మిర్యాలగూడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా ,దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భాజపా కార్యకర్తలు స్థానిక బస్ స్టేషన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీ కార్యాలయం పై దాడి చేయడం ను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జ్ సాదినేని శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ పట్టణ శాఖ అధ్యక్షుడు తుమ్మలపల్లి హనుమంత రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి సాదినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యాలయం పై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ విధానాలు ఆ పార్టీ ప్రతిష్ట దిగజారుతుందనీ పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భాజపా కార్యాలయల లపై గాని కార్యకర్తలపై గాని నాయకులపై గాని దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ పట్టణ శాఖ అధ్యక్షులు తుమ్మలపల్లి హనుమంత రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వమని తెలంగాణలో భాజపా బలంగా అయితున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఇటువంటి కుహనా దాడులకు పాల్పడిందని ఆయన విమర్శించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా స్టేట్ కౌన్సిల్ మెంబర్ కనపర్తి సత్యప్రసాద్, సీనియర్ నాయకులు బంటు సైదులు, బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు ఎడ్ల రమేష్, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ సజ్జల నాగిరెడ్డి, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు కొండేటి సరిత, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తం రెడ్డి సూర్యాపేట కిసాన్ మోర్చా ఇన్చార్జ్ చల్లమల్ల సీతారాం రెడ్డి జిల్లా నాయకులు రాజశేఖర్ నాయక్, జవ్వాజి సత్యనారాయణ యాదవ్ పట్టణ నాయకులు పెద్ద బోయిన వెంకటరమణ , బంటుగిరి, చిలుకూరు శ్యామ్, శేఖర్, మేడి నవీన్, గుండ్లపల్లి శ్రీకాంత్, నక్క రవి, ఫోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆర్టిస్టు రమణ, ఉప్పల లక్ష్మారెడ్డి ,మండల సోములు, పెద్దమాం పాతకోటి సైదులు, జంగిల్ రవి, పెదమాం భారత్, గుండ్లపల్లి శ్రీకాంత్, మంద గిరి, నక్క శ్రీనివాస్ , ఆర్టిస్ట్ కొంగరి రమణ, రాజిరెడ్డి, యాదమ్మ, నందికొండ హరిప్రసాద్, కనపర్తి రాంప్రసాద్, మోదల అశోక్, జగదీష్ మోతే రాంబాబు, కామ్ లే భగవాన్ తదితరులు పాల్గొన్నారు