ప్రజాలహరి హైదరాబాద్ డిసెంబర్ 4న చైతన్య స్ఫూర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సి.ఎం. డా|| కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి ఘనంగా నివాళులర్పింద్దాం : ఎఫ్‌ఏఐ నేషనల్ ప్రెసిడెంట్ బెల్ది శ్రీధర్
డిసెంబర్ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్యగారి 3వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ హైటెక్స్‌లోని హాల్ నెంబర్ – 4లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున్న డా|| కొణిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరం మరియు ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఏఐ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని నేషనల్ ప్రెసిడెంట్ బెల్ది శ్రీధర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా|| కొణిజేటి రోశయ్య విలువలను స్ఫూర్తిని , చైతన్యాన్ని గుర్తు చేసుకుంటూ అందరూ అదేవిధంగా ఎదగాలని కోరుకుంటూ ఈ ‘చైతన్య స్ఫూర్తి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని చేయాలని తలపెట్టగానే డా|| కొణిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరం సభ్యులు సీల్‌వెల్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ బండారు సుబ్బారావు, ఆర్.ఎస్. బ్రదర్స్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మరియు తదితర సభ్యులు ముందుకు వచ్చిన తరువాత ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకు వచ్చామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, గౌరవ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు టి.జి. భరత్, జీఎమ్‌ఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు, ఆత్మీయ అతిథులుగా ఆర్యవైశ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ శాసనసభ్యులు, రెండు తెలుగు రాష్ట్రాల ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్లు, వివిధ ఆర్యవైశ్య సేవా సంస్థల నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని అలాగే ఈ సందర్భంగా విద్యారంగం, సేవా రంగం, బిజినెస్ రంగంలో రాణించి ముందంజలో ఉన్నవారి ప్రతిభను గుర్తించి వారిని డాక్టర్ కొణిజేటి రోశయ్య స్పూర్తి అవార్డుతో సత్కరిస్తున్నామని, ఈ సందర్భంగా డా|| కొణిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరం తరుపున ఆర్థికంగా అవసరాలు ఉన్న వారిని గుర్తించి ఆర్థిక సహాయం, వేద పాఠశాల గురుకులానికి మరియు బ్లైండ్ స్కూల్‌కు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, ఈ కార్యక్రమంలోనే సుమారు 14 వందల మంది స్పెషాలిటీ వైశ్య వైద్యుల పేరు, చిరునామా, సంప్రదించాల్సిన నెంబర్ వారి పూర్తి వివరాలతో కూడిన క్యూఆర్‌కోడ్, వారి ఫోటోతో సహా ప్రింట్ చేయబడిన ‘నేషనల్ వాసవి డాక్టర్స్ డైరెక్టరీ’ అతిథుల చేతులమీదుగా ఈ సమావేశంలో విడుదల చేయడం జరుగుతుందని ఈ డైరెక్టరీలో 11 రాష్ట్రాలలో ఉన్న వైశ్య వైద్యుల వివరాలు అందుబాటులో ఉంచబడ్డాయని ఈ డైరెక్టరీ ప్రచురణకు ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ బెల్ది శ్రీధర్, సెక్రటరీ జనరల్ కనమర్లపూడి కోటేశ్వరరావు, కమిటీ మెంబర్స్ రమేష్ కె.గ్రంథి, జి. నంబెర్ మల్లు, రాజేంద్రప్రసాద్, డి. నరేష్, డా|| నాగనంధిని మరియు అన్ని రాష్ట్రాల నుండి కో-ఆర్డినేటర్స్ , డాక్టర్ కో-ఆర్డినేటర్స్ కొన్ని నెలలు శ్రమించి ఈ డైరెక్టరీని రూపొందించడం జరిగిందని, అత్యవసరమైన ఈ డైరెక్టరీని ఎఫ్‌ఏఐ అవోపావారు అన్ని వైశ్య సంస్థలకు, ట్రస్టులకు, దేవాలయాలకు, అన్నదాన సత్రాలకు, హాస్టల్స్‌కు, వైశ్య పత్రికల వారికి ఉచిత ఆవిష్కరించినరోజే అందజేయబడుతుందని. ప్రతి సంస్థ తరుపున వారి అధ్యకక్షులు, కార్యదర్శి, కోశాధికారులు డిసెంబర్ 4న జరిగే కార్యక్రమంలో పాల్గొని ఈ డైరెక్టరీని తీసుకొని వారి సంస్థలో ఉంచి, సమాజంలోని అందరి సభ్యులకు ఈ డాక్టర్స్‌ను వివరాలు అందుబాటులో ఉంచగలరని, డిసెంబర్ 4 నాడు ఈ డైరెక్టరీని అన్ని వైశ్య సంస్థలకు ఎఫ్‌ఏఐ- అవోపా ద్వారా ఉచితంగా ఇవ్వబడుతుంది. వెలకట్టలేనిది ఈ డాక్టర్స్ డైరెక్టరీ అని, వెలకట్టాలంటే అది రూ|| 1200/- పైనే ఉంటుందని, కనిపించే దైవం వైద్యుడని ఎవరైన ఈ డైరెక్టరీ పొందాలనుకునేవారు గోగుల్ ఫామ్‌లో వారి వివరాలు పొందబర్చగలరని దీనికి సంబంధించిన వివరాలు ఈ క్రింది వైబ్‌సైట్‌లో పొందుపర్చామని ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ బెల్ది శ్రీధర్ తెలియజేశారు.