Ultimate magazine theme for WordPress.

సంక్రాంతి లోపు రైతు భరోసా (రైతుబంధు) ఇస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Post top
home side top

సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. డిసెంబర్‌లో జరిగే శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లిస్తామన్నారు. ఈ విషయంలో మారీచుల మాటలను విశ్వసించరాదని రైతాంగానికి సూచించారు.

♦️ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పాలమూరు జిల్లాలో జరిగిన రైతు పండుగ విజయవంతమైన నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు.

♦️రైతు పండుగలో ప్రత్యక్షంగా పాల్గొన్న రైతాంగం, రాష్ట్ర వ్యాప్తంగా 568 రైతు వేదికల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది రైతులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఏమన్నారంటే…

♦️“సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లించేది గ్యారెంటీ. ఈ విషయంలో ఎవరినీ నమ్మకండి. రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేయడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు తుమ్మల గారు, పొంగులేటి గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాం.

♦️ఈ నెలలో జరిగే శాసనసభ సమావేశాల్లో విధివిధానాలపై చర్చించి సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని హామీ ఇస్తున్నాం. రైతు భరోసా పథకం కొనసాగుతుంది.

♦️ప్రభుత్వ పరంగా వాస్తవాల ప్రాతిపదికన కొన్ని అంశాలు చర్చించుకుని ముందుకు వెళ్లడం ద్వారా రైతాంగానికి, మహిళలకు, విద్యార్థినీ విద్యార్థులకు ఒక మంచి పాలన అందించడం సాధ్యమవుతుంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో 69 వేల కోట్ల అప్పులు ఉండేవి.

♦️సరిగ్గా పదేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ అప్పుపై అసలు, మిత్తి కలిపి ప్రతి నెలా 6,500 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితి ఉంది.

♦️తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అప్పు ఉందన్న సంగతి ఆ పదేండ్లలో ఏ సందర్భంలో కూడా ఆర్థిక నిపుణులుగానీ, రాజకీయ విశ్లేషకులుగానీ ఆర్థిక మంత్రిగానీ ప్రజలకు వాస్తవాలు వెల్లడించలేదు.

♦️ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టి తర్వాత వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతో ఆస్తులు, అప్పులు, విద్యుత్, సాగునీటి రంగాలపై శ్వేతపత్రం విడుదల చేశాం. ఆ లెక్కల ప్రకారం 7 లక్షల కోట్ల అప్పులు తేలాయి. దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా క్షీణించిందో ప్రజలు అర్థం చేసుకోవాలి.

♦️గత ప్రభుత్వం చెల్లించాల్సిన రైతు బంధు చెల్లించకుండా బకాయి పెడితే, అధికారం చేపట్టిన వెంటనే 7,625 కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం చెల్లించింది.

♦️నాలుగు విడతల్లో కలిపి మొత్తంగా 25,35,964 మంది రైతు కుటుంబాలకు 20,616.89 కోట్ల రూపాయల మేరకు రుణ మాఫీ చేశాం.

♦️1 విడత – 18-07-2024 నాటికి లక్ష రూపాయల లోపు ఉన్న 11,34,412 మంది రైతులకు 6034.96 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేశాం.

♦️2 విడత – 30-07-24 నాటికి లక్షన్నర వరకు 6,40,823 మంది రైతులకు 6,190.01 కోట్ల రూపాయల మేరకు రుణ మాఫీ జరిగింది.

♦️3 విడత – 15-08-2024 నాడు రెండు లక్షల వరకు 4,46,832 మంది రైతులకు 5,644.25 కోట్ల రూపాయల మేరకు రుణ మాఫీ అయింది.

♦️4 విడత – 30-11-2024 న గతంలో సాంకేతిక లోపాలు, రేషన్ కార్డు లేదా బ్యాంకుల్లో లోపాల వంటి కారణాలతో నిలిచిపోయిన 3,13,897 మంది రైతు కుటుంబాలకు 2747.67 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో వేయడం జరిగింది.

♦️దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈ దేశంలోనే ఇదొక రికార్డు.

♦️2018 ఎన్నికల తర్వాత గత ప్రభుత్వం రుణ మాఫీ 4 ఏండ్ల పాటు సాగదీస్తూ విడత వారిగా చెల్లించడంతో వడ్డీలకే పోయిందని, 2018-23 మధ్య ఐదేండ్ల కాలంలో 3,031 కోట్ల మాత్రమే అసలు రుణ మాఫీ చేసింది.

♦️గత ప్రభుత్వం 2023 వానాకాలం చెల్లించకుండా వదిలేసిన రైతు బంధు బకాయిలు 7,625 కోట్ల రూపాయల కూడా ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే చెల్లించింది.

♦️గతంలో… వరి వేస్తే ఉరి వేసుకోవలసిందే. ధాన్యం కొనుగోలు కేంద్రాలే ఉండవని చెప్పిన పరిస్థితుల నుంచి వరి వేసుకోండి. కొంటామని చెప్పి భరోసా ఇవ్వడంతో పాటు సన్నాలు వేసుకుంటే బోనస్ ఇస్తామని ప్రోత్సహించాం.

♦️వర్షాకాలంలో సన్నాలకు బోనస్ ఇచ్చాం. బోనస్ ఒక్కసారి ఇచ్చి వదిలేయడం కాదు. వచ్చే సీజన్ లో కూడా బోనస్ ఇస్తాం. తెలంగాణలో వాడకం ఎక్కువగా ఉన్న, అలాగే దిగుబడి అధికంగా ఉండే తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వేయాలి. తెలంగాణ ప్రజలు అత్యధికంగా ఈ బియ్యం ఎక్కువగా తింటారు.

♦️రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వంటి ప్రభుత్వ వసతి గృహాల్లో సన్న బియ్యంతో అన్నం పెట్టనున్నాం. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రైతాంగం అధిక వినియోగం ఉన్న సన్న రకాలను వేయాలి.

♦️ఇందులో రాజకీయాలు చేసే సందర్బంగా కాదు. ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉన్నది. వ్యవసాయం దండగ కాదు. పండుగ అన్న భరోసా రైతుల్లో కల్పించాలి” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.