ప్రజా పరిరక్షణ మా ధ్యేయం డిసెంబర్ 2న మిర్యాలగూడ లో జరిగే మహాసభను విజయవంతం చేయాలి… జూలకంటి రంగారెడ్డి
ప్రజా పరిరక్షణ తమ ధ్యేయం… డిసెంబర్ 2న మిర్యాలగూడ ఎన్.ఎస్.పి క్యాంపు గ్రౌండ్లో జరిగే మహాసభను విజయవంతం చేయాలి….జూలకంటి రంగారెడ్డి..
(మిర్యాలగూడ ప్రజాలహరి )
.
ప్రజా పరిరక్షణ తమ ధ్యేయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గం మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి గ్రామస్థాయి మొదలు జాతీయ స్థాయి వరకు మహాసభలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు ఆ మహాసభల్లో కార్యకర్తలు, మేధావులు ఇచ్చే అభిప్రాయాలను పరిగణలో తీసుకొని ఆ విధంగా భవిష్యత్ కార్యక్రమం నిర్మించి ముందుకు సాగుతామని చెప్పారు భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన నాటించి సామాన్య కార్మిక కర్షక వర్గ సమస్యలపై పోరాడిందని పేర్కొన్నారు నిత్యం ప్రజల సమస్య జెండాగా తమ పార్టీ పని చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. డిసెంబర్ రెండో తేదీన మిర్యాలగూడ ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో జరిగే జిల్లా మహాసభను కార్యకర్తలు నాయకులు మేధావులు ప్రజలు విజయవంతం చేయాలన్నారు. కమ్యూనిస్టు పార్టీ సభలు నిర్వహించినా, ధర్నా చేసిన రాస్తారోకోలు చేసిన ప్రజా సమస్యల పరిష్కారం ఉద్దేశమే ఉంటుంది తప్ప వేరే ఆలోచన ఉండదని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అధికంగా ఉన్నాయి వాటిని గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లి పరిష్కారం కోసం పని చేస్తామని వివరించారు. తమ పార్టీ నిత్యం ప్రజల కోసం సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. సిపిఎం పార్టీ సానుభూతిపరులు కార్యకర్తలు నాయకులు మేధావులు డిసెంబర్ 2న జరిగే మహాసభను విజయవంతం చేయాలని మరోసారి పిలిపించారు