కాంగ్రెస్ మంత్రులు
రైతు పండుగ చేయడం సిగ్గుచేటు
టిఆర్ఎస్ నాయకులు కట్ట
వేములపల్లి( ప్రజాలహరి) కాంగ్రెస్ నాయకులు రైతు పండుగ చేయడం బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్ట మల్లేష్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం ఆయన శెట్టిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి రైతులకు వివిధ రకాల హామీలను ఇచ్చి అట్టి హామీలను తుంగలో తొక్కి మరోపక్క రైతు పండుగ చేయడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎకరాకు 15000 రూపాయలు ఇస్తానని నేడు అవి ఇవ్వకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐదువేల రూపాయలను రాకుండా కొండ నాలుక మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయింది అన్న విధంగా రైతులతో చెలగాటలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఒక ఆర్టీసీ బస్సు మినహాయించి మిగతా 5 గ్యారెంటీలలో ఏది పూర్తిగా చేయలేకపోయిందని ఆయన ధ్వజమెత్తారు. అధికారం కోసం వివిధ రకాల హామీలను ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకొని అట్టి హామీలను తుంగలో తొక్కిడి రైతు పండుగలు చేయడం చాలా విడ్డూరం గా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇచ్చినటువంటి గ్యారంటీలను తక్షణమే అమలు చేసి రైతు పండుగ చేసుకోవచ్చని ఆయన కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.