
వేములపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
డి.ఎస్.పి రాజ్
వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని, వేములపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, శుక్రవారం మిర్యాలగూడ డిఎస్పి రాజ్ రాజశేఖర్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది అందరితో కలిసి పోలీసులంటే ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాలని చెప్పారు. అంతేకాకుండా మండలంలో పొట్టి గ్రామంలోని ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మనతో వారి సమస్యలను చెప్పుతూ, మరి ఇతర సమస్యలనైనా బయటికి లాగ వచ్చాని ఆయన అన్నారు. ముఖ్యంగా మండలంలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వారిని తీసుకువచ్చి ఒక దోస్త్ గా మాట్లాడి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీయవచ్చని ఆయన సూచించారు. అంతేకాకుండా పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎలాంటి అహంభావం లేకుండా ప్రజలతో మమేకంగా కలిసిమెలిసి ఉండాలని ఆయన వారికి సూచించారు. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఫైళ్లను తనిఖీలు చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సివిల్ కేసులు ఉన్నట్లయితే చట్ట ప్రకారంగా కోర్టుకు అప్పచెప్పాలని ఆయన కోరారు. మండలంలోని గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చిన్న చిన్న పంచాయతీలు, భార్యాభర్తల పంచాయతీలు ఉన్నట్లయితే 100కు 100% స్టేషన్ పరిధిలోని ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ ప్రయత్నం చేయాలని ఆయన పోలీసులు సూచించారు. పోలీస్ సిబ్బంది వాహనాలను నడిపే వ్యక్తులను తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అంతేకాకుండా మేజర్ కానీ పిల్లలు వాహనములు నడిపినట్లు అయితే, వివాహం ఉన్న పోలీస్ స్టేషన్ లో పెట్టి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు. ముఖ్యంగా వేములపల్లి మండలాన్ని గంజాయి రహిత మండలంలో చూడాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు, ఎస్ఐ నరసింహారావు, జందార్లు ప్రేమ్ సింగ్, సామ్యూల్, సైదులు, సిబ్బంది మట్టయ్య, వెంకట్, మరియన్న తదితరులు పాల్గొన్నారు