*మిర్యాలగూడలో గురుకుల పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన MLA
మిర్యాలగూడ ప్రజాలహరి…ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని *తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల ను* ఆకస్మికంగా సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి.. హాస్టల్ లోని రాత్రి భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.. ..
అనంతరం హాస్టల్ పరిసరాలు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు..
*బియ్యం నాణ్యతగా లేవని నాణ్యమైన బియ్యాన్ని తీసుకొని రావాలని సూచించారు, మరోసారి ఇలాంటి బియ్యంతో భోజనం పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు…*
అలాగే హాస్టల్ లో టాయిలెట్స్ శుభ్రంగా లేవు ఇలా ఉండటం మూలాన దోమలు అధికమై విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి వెంటనే వాటిని శుభ్రపరచి ప్రతిరోజూ సానిటైజేషన్ చేయాలి అని హెచ్చరించారు…
అనంతరం *10వ తరగతి విద్యార్థులతో* కలిసి మాట్లాడుతూ మీరు మంచి విద్యను నేర్చుకొని మీ తల్లి తండ్రులు గర్వపడే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు..
మన ముఖ్యమంత్రి *రేవంత్ రెడ్డి , విద్యార్థులకు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండాలని..
వారి *కాస్మొటిక్ మరియు మెస్ చార్జీలు* పెంచడం జరిగింది.. కావున మీరు మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉంటూ మంచిగా చదువుకోవాలని సూచించారు ..
*అలాగే 10 వ తరగతి విద్యార్థులకు ఏదైనా స్టడీ మెటీరియల్స్ కావాలి అన్నా, స్టడీ చైర్స్ లాంటివి ఎలాంటి అవసరం ఉన్నా నాకు తెలియజేయండి నేను నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని అన్నారు…*
*విద్యార్థులు ఇంకా మీరు చదువుకోవడానికి ఏదైనా సమస్యలు ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు అని అన్నారు…*
ప్రతీ విద్యార్థి 10 శాతం మార్కులు తెచ్చుకొని మీ కుటుంబ సభ్యులు, మీ గురువులు గర్వపడేలా చేసి మన మిర్యాలగూడ కి పేరు తీసుకొని రావాలని అన్నారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..