మహాత్మ జ్యోతిబాఫూలే విగ్రహాన్ని హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలి…..
బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్
మిర్యాలగూడ ప్రజాలహరి.సామాజిక సంఘసంస్కర్త బడుగు బలహీన వర్గాల బాంధవుడు మహాత్మా జ్యోతిబాపూలే 134 వర్ధంతి సందర్భంగా స్థానిక పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో జ్యోతిరావ్ ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సామజిక సంఘ సంస్కర్త, బలహీన వర్గాల దీనజన బాంధవుడు, భారతీయ మేధావి, సమ సమాజ నిర్మాణ కృషివలుడు, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి ప్రదాత, అంటరానితనం ,కుల వివక్షతకు వ్యతిరేకంగా కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త ఫూలే అని మహిళల విద్య కోసం,అక్షరమే ఆయుధంగా చేసుకుని తన భార్య ను ఒక ఉపాధ్యాయురాలు గా తీర్చిదిద్ది అనేక పాఠశాలలు నెలకొల్పి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు అని అయన త్యాగాన్ని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని అన్నారు.మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 134.వ వర్ధంతి సందర్బంగా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు,సామాజిక న్యాయం దిశగా అన్ని పార్టీలు కూడా ఆలోచించాలని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కినప్పుడే మహాత్మ జ్యోతిబాపూలే కి అసలైన నివాళి అని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో, బీసీ యువజన నాయకులు దోనేటి శేఖర్ ముదిరాజ్, అఖిల్, అక్షయ్,ఆదిత్య, మహేష్, సురేష్, శ్రీకాంత్, సింహాద్రి, రాము, వంశీ, మురళి, శ్రవణ్, శివ, దిలీప్, లక్ష్మణ్, రవి, నందు తదితరులు పాల్గొన్నారు