Ultimate magazine theme for WordPress.

దామరచర్ల మండలంలో గ్రామపంచాయతీ బోనాల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి
దామరచర్ల మండలం *నర్సాపురం(శాంతి నగర్)* గ్రామంలో మరియు

మిర్యాలగూడ మండలం *జాలు బాయ్ తండా* గ్రామంలో మరియు

మాడుగులపల్లి మండలం *తోపుచర్ల* గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి … వారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ది చెందితేనే నియోజకవర్గం అభివృద్ది చెందుతుంది , రాష్ట్రం అభివృద్ది చెందుతుంది అని అన్నారు…

కేవలం ఒకే సంవత్సరం లో ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక రైతు ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు..
రానున్న కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు..
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ గారు, సీనియర్ నాయకుడు స్కైలాభ్ నాయక్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ , మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు పాల్గొన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.