గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన
వేములపల్లి( ప్రజాలహరి) మాడుగుల పల్లి మండలంలోని తోపుచర్ల గ్రామపంచాయతీ లో గల నూతన గ్రామపంచాయతీ భవనానికి స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనం ఉన్నట్లయితే గ్రామంలోని సర్పంచ్, వార్డు మెంబర్లు అధికారులు అందరూ కలిసి సమన్వయంతో గ్రామం లోని సమస్యల గురించి మాట్లాడుకుని గ్రామ సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట మాడుగులపల్లి మండల పార్టీ అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Next Post