*కెసిఆర్ (KCR)సినిమాను ప్రారంభించి వీక్షించిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవ శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు గారు*..
ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న పద్మావతి ఏ/సీ థియేటర్ నందు నటుడు రాకింగ్ రాకేష్ నటించిన కేసిఆర్(కేశవ చంద్ర రమావత్ ) సినిమా రెండు రోజుల క్రితం విడుదలైంది ఇట్టి సినిమాను ఈరోజు ఈ థియేటర్లో మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించి సినిమాను వీక్షించారు.. ఈ సందర్భంగా కెసిఆర్ సినిమా గత పది సంవత్సరాలలో కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మరియు రాష్ట్ర అభివృద్ధి గురించి ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి.. కాబట్టి ఇది అందరూ చూడదగ్గ సినిమా దీనిని ఆదరించవలసిందిగా భాస్కర్ రావు గారు కోరారు…
ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, కేసీఆర్ గారి అభిమానులు, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు