Ultimate magazine theme for WordPress.

అక్రమంగా పిడిఎస్ బియ్యం రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

Post top

ప్రజాలహరి, మిర్యాలగూడ క్రైమ్ ………….
రేషన్ బియ్యం ట్రాన్స్పోర్ట్ చేసే అంతరాష్ట్ర ముఠా అరెస్టు ……
గత నెల 24వ తేదీన జరిగిన రేషన్ బియ్యం ట్రాన్స్పోర్ట్ తాలూకు వాహన ప్రమాదంలో ఒకరు మరణించగా ఇతర కూలీలకు తీవ్రమైన గాయాలయ్యాయి అట్టి గూడ్స్ డ్రైవరు మీద కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తుండగా ఈరోజు అనగా 19 11 2024 ఉదయం 10 గంటలకు దాచేపల్లి గ్రామానికి చెందిన మందపాటి నరసింహారావు మరియు కల్లూరు లింగయ్యను వాడపల్లి పోలీస్ స్టేషన్ కు రాగ పోలీసుల విచారణలో నేరస్తులు వారి గూడ్స్ వాహనం డ్రైవర్ దేవరకొండ అమూల్య మరియు ముఠామేస్త్రి సైదారావు తో కలిసి బండవ తండాకు చెందిన బండావత్ సర్దార్ తో మిర్యాలగూడ మరియు దామరచర్ల పరిసర గ్రామాలలో ఆహార భద్రత లబ్ధిదారుల వద్ద నుండి ప్రభుత్వ ప్రజా పంపిణీ బియ్యాన్ని మోసపూరితంగా తక్కువ ధరకు కొనుగోలు చేసి రాత్రి సమయాల్లో వారి అశోక్ లేలాండ్ మినీ గూడ్స్ వాహనం గల దానితో దొంగతనంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రవాణా చేస్తున్నారు అని పోలీసుల విచారణలో తేలింది దామరచర్ల మండలం బండావత్ తండాలో బండావత్ సర్దార్ ఇంటి వద్ద కూలీలకు తెలియకుండా వారి చేత పిడిఎస్ బియ్యాన్ని లోడు చేసుకొని తిరిగి వెళ్లేటప్పుడు మరుసటి రోజు తెల్లవారుజామున దామరచర్ల గ్రామ శివారులో నరసాపురం ఎక్స్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది.
అందులో ఉన్న కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి ఒక వ్యక్తి చనిపోగా ఆ ప్రమాదం గురించి కేసు విచారణ చేస్తుండగా అట్టి ప్రమాదవస్థలం వద్ద నీరవాహంగాల అందు పిడిఎఫ్ బియ్యం బస్తాలు ఉన్నట్లుగా గుర్తించి దానికి సంబంధించిన నేరస్థుల గురించి విచారణ చేస్తుండగా మందపాటి నరసింహారావు తండ్రి సాంబయ్య కల్లూరు లింగయ్య తండ్రి బుల్లయ్య లు వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఈరోజు లొంగిపోవడం జరిగింది కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, వాడపల్లి ఎస్సై హరికృష్ణ లు తెలిపారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.