మిర్యాలగూడలో ఈనెల 19 న స్వర్గీయ పులి శేషయ్య గారి స్మారక రంగస్థలం పురస్కార తృతీయ వార్షిక నాటకోత్సవాలు….. (మిర్యాలగూడ ప్రజాలహరి..) ఈనెల 19వ తేదీన మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డ్ నందు కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో క్రీ .శే .పులి శేషయ్య గారి స్మారక రంగస్థల నమస్కారం తృతీయ నాటకోత్సవాలు- 2024 నిర్వహించబడునని మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం అధ్యక్ష కార్యదర్శులు బోయినపల్లి భుజంగరావు, పులి కృష్ణమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు .ఈ కార్యక్రమం 19 తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైతుందని పేర్కొన్నారు.. ముందుగా స్వర్గీయ ధరావత్ శివరాం నాయక్ నాటక కళాకారుడి సంతాప సభ జరుపబడునని. ప్రారంభకులుగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్ భాస్కరరావు నల్లమోతు భాస్కరరావు, జూలకంటి రంగారెడ్డి, మరియు మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం అధ్యక్షులు బోయినపల్లి భుజంగరావు వ్యవహరిస్తారని చెప్పారు కార్యక్రమం ప్రారంభం అనంతరం బ్రహ్మరథం అనే నాటకాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నాటకానంతరం మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తడక మ రామచంద్రరావు , మిర్యాలగూడ ప్రముఖ జ్యోతిష్య, నాటక కళాకారులు పి లక్ష్మీనారాయణ శర్మ, శ్రీ వెంకటేశ్వర నాటక మండలి జాన్ పహాడ్ అధ్యక్షులు ఎస్కే ముస్తఫా, గుడుగుంట్ల పాలెం బుర్రకథ నాటక మండలి అధ్యక్షులు దొంతకాని వెంకటేశ్వర్లు కు సన్మానం చేయడం జరుగుతుందని వివరించారు. నాటకాలపై అవగాహన ఉన్న వాళ్ళందరూ హాజరుకావాలని కోరారు పుర ప్రముఖులు పట్టణ ప్రజలు అందరూ హాజరు కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.