రైస్ మిల్లర్లు కొందరు ఎంఎస్పీ కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వ మాట, ప్రభుత్వ సూచనలు లెక్కచేయకుండా వ్యవహరిస్తే ఆ మిల్లులను సీజ్ చేస్తా సబ్ కలెక్టర్ అమిత్ నారాయణన్…. మిర్యాలగూడ ప్రజాలహరి. మిర్యాలగూడ లోని శెట్టి పాలెం శివారు మహర్షి రైస్ మిల్లు యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ధాన్యం కొనుగోలు ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మెస్పీ కంటే 300 రూపాయలు తక్కువగా కొనుగోలు చేస్తుందని ఇటువంటి యాజమాన్యాన్ని ఉపేక్షించేది లేదని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణన్ అన్నారు. ఆయన సోమవారం ఆకస్మిక మహర్షి రైస్ మిల్లును తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను గంటల కొద్ది నిలబెడుతూ ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, రాష్ట్ర క ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, ఇతర మిల్లర్స్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం లేదని మిర్యాలగూడలో కొన్ని మిల్లులే ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నాయి వారు రైతులను ఇబ్బంది పెట్టిన ఎం.ఎస్.పి ధర కంటే తక్కువ కొనుగోలు చేసిన ఆ మిల్లులను ఉన్నఫలంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు . ప్రభుత్వం నిర్ణయించిన ధర తగ్గిస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. జిల్లా సివిల్ సప్లై, తాలూకా సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు ఇంత మోసం జరుగుతున్న రైతుల నుంచి తమకు కంప్లీట్ వస్తున్నాయని ఎవర్ని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు ప్రతి మిల్లు వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్ మరియు పర్యవేక్షణకు సీఐ ఎస్ఐలను నియమిస్తున్నామని ఆయన చెప్పారు. మహర్షి రైస్ మిల్లులకు సంబంధించిన దాన్యం కొనుగోలు సంబంధించిన రికార్డులు మొత్తం వెరిఫై చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రోజువారి రైతు వివరాలు, ఇతర ప్రాంతాన్ని వచ్చే ధాన్యం వివరాల పత్రాలు కొనుగోలుకు సంబంధించిన కాగితాలు మాత్రం లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఇప్పటికైనా మిల్లర్లు స్పందించి కొనుగోలుకు సంబంధించిన వివరాలు ఏరోజుకారోజు పక్కాగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి ,డిస్టిక్ సివిల్ సప్లై కార్యాలయానికి అందజేయాలని సూచనలు చేశారు. తనిఖీల లో సబ్ కలెక్టర్ వెంట మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, డిఎస్ఓ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.