ప్రభుత్వాలు మారిన
ప్రజా ప్రతినిధులు మారిన
రైతుల రాత మాత్రం మారదాయే?
మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు
వేములపల్లి( ప్రజాలహరి) ప్రభుత్వాలు మారిన ప్రజా ప్రతినిధులు మారిన రైతుల రాతలు మారకపోవడంతో, రైతన్నలు మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్తి వివరాలలోకి వెళితే, ఏ రాజకీయ నాయకుడైన రైతే రాజు దేశానికి వెన్నెముకని, రాజకీయ నాయకులు చెబుతున్నటువంటి మాట అందులో భాగంగానే నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం లోని శెట్టిపాలెం గ్రామ సమీపంలో నార్కట్పల్లి అద్దంకి రహదారిపై రైతులు మద్దతు ధర కోసం రోడ్డు ఎక్కి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దేశంలోని ప్రతి నిత్యవసర వస్తువులకు ప్రతిరోజు, ప్రతి ఏటా, ధరలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, అందులో భాగంగా ప్రతి మనిషి నిత్యం తినేటటువంటి బియ్యానికి మాత్రం ప్రతి ఏటా రేటు పెరుగుతూనే వస్తుంది, కానీ ధాన్యానికి మాత్రం ధర పెరగటం లేదు, మరి ఇది రైతులు చేసుకున్న పాపమా? లేక శాపమా? ఇట్టి విషయాన్ని ప్రతి రాజకీయ నాయకులు ఒకసారి రైతుల పట్ల పునరాలోసిన చేయాలని వారు రాజకీయ నాయకుల్ని పదేపదే కోరుతున్నారు. ప్రతి రాజకీయ నాయకులు వేదికలెక్కి రైతుల గురించి గొప్పలు చెప్పటం తప్ప రైతులకు చేసిన మేలు ఏమి లేదని రైతులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతి రాజకీయ నాయకులు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు గురించి మాట్లాడకపోవడం వలన దానిని ఆసరాగా తీసుకొని రైస్ మిల్లు యజమానులు ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కూడా, పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు , చేస్తూ రైతుల నోట్లు మట్టి కొడుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి మిల్లర్స్ కి ప్రతినిత్యం కలెక్టర్ పర్యవేక్షణ ఉన్నప్పటికిని మిల్లర్లు కలెక్టర్ అలా వచ్చి, ఇలా వెళ్ళిపోగానే మిల్లర్లు ఆడింది ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం ఉదయం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఉదయం సమయంలో ప్రతి మిల్లు దగ్గరికి స్వయంగా వెళ్లి మిల్లు యజమానులను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రతి మిల్లు యజమానిని కలిసి స్వయంగా చెప్పడం జరిగింది. అట్టి విషయాన్ని మిల్లు యజమానులు తుంగలో తొక్కి, రైస్ మిల్లులో సెల్లార్ నిండిందని సాకుతో ధాన్యాన్ని కొనకుండా గేట్లకి తాళం వేసుకొని రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్ సప్లై అధికారులు అందరూ కలిసి తక్షణమే ఒక సమావేశం నిర్వహించి , రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లయితే బాగుంటుందని పలువురు రైతులు కోరుకుంటున్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Prev Post