*కాంగ్రెస్ పార్టీలో కుల, మత విభేదాలకు తావు లేదు..MLA –
దేశంలోనే మొట్టమొదటి సారిగా రాహుల్ గాంధీ
ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కుల గణన పై కొత్త జీవోని విడుదల చేసిన సందర్భంగా మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో బీసీ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – సమక్షంలో ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా MLA -BLR గారు మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం సంపండ వర్గాల ప్రజలు కలసి ఎన్నుకున్న ప్రభుత్వం అని అన్నారు… కులం, మతం అనే విబేధాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు తగిన గుర్తిపు అందించాలి అనే లక్ష్యంతో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుల గణన చేపట్టే గొప్ప నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు… కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కుల, మత విభేదాలకు తావు లేదు అని అన్నారు.. అంతే కాదు BLR అంటేనే అందరి వాడు , *BLR బ్రదర్స్* లో అన్ని కులాలు, అన్ని మతాలు కలసి ఒక కుటుంబంలా ప్రజల క్షేమం కోసం పనిచేస్తారు అని అన్నారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..