సాగుతున్న పనులు…. తిప్పర్తి బైపాస్… ,(మిర్యాలగూడ, తిప్పర్తి… ప్రజాలహరి ప్రజాలహరి) తిప్పర్తి మండల కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణకు కోసం మంజూరైన బైపాస్ రోడ్డు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాదిన్నర కాలంగా పనులు కొనసాగుతూనే ఉంది. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య కొంతమేరకు తగ్గుతుంది. అంతేకాక వాహనాల రద్దీ కూడా తగ్గటం వలన వాహనాల రద్దీ తగడం వలన ప్రజలు కూడ ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గుంటూరు- హైదరాబాద్ మధ్యాహ్నం వాహనాల రాక రద్దీ ఎక్కువ ఉండడంతో మండల కేంద్రంలో నిత్యం ట్రాఫిక్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సబ్ స్టేషన్ మొదలు గ్రామం చివర రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కోసారి వాహనాలు స్పీడ్ అధికంగా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర రోడ్ సేఫ్టీ వారు తిప్పర్తికి బైపాస్ రోడ్డు మంజూరు చేశారు. ఈ బైపాస్ రోడ్డు మీద భారీ వాహనాలు, లారీలు ట్రాన్స్పోర్ట్ ఈ ప్రాంతం గుండా మళ్లించేందుకు అధికారులు ప్రణాళికలు చేశారు. కానీ వారు ప్రయత్నానికి రోడ్డు పనులు ఆలస్యం కావడం అనుకున్న లక్ష్యాలు చేర్పు లేక పోతున్నారు అంతేకాక ఈ బైపాస్ రోడ్డు వల్ల మండల కేంద్రంలో కూడా విస్తృతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది ఈ విషయాన్ని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Next Post