*రామనూజ చార్యులు గారి ప్రధమ వర్ధంతి లో పాల్గొని అయన చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ MLA & BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్. నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ ప్రజాలహరి..
రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు గ్రహీత ముడుంబై రామానుజాచార్యులు గారి ప్రధమ వర్ధంతి కార్యక్రమాన్ని మిర్యాలగూడ పట్టణంలోని నందిపహాడ్ బృందావన్ గార్డెన్స్ లో కుటుంబ సభ్యులు ఆయన స్నేహితులు నిర్వహించారు.. ఇట్టి ప్రధమ సంవత్సరిక కార్యక్రమానికి మాజీ MLA & మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జ్. నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని రామనూజ చార్యులు గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.. *ఈ సందర్బంగా మాట్లాడుతూ రామనూజ చార్యులు గారి సేవలు శ్లాఘనీయమని నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. విద్యారంగంతోపాటు సామాజిక రంగాలలో ఎనలేని సేవలు అందించిన మానవతామూర్తి అని కొనియాడారు. అనంతరం లయన్స్ క్లబ్ వారు సమాకూర్చిన నిధితో పదవ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమనాన్ని అందించారు… లయన్ రామానుజాచార్యులుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు*. స్వర్గీయ రామానుజాచార్యుల ధర్మపత్ని మంగతాయారు గారు మాట్లాడుతూ ఆయన సేవలలో పాల్గొనే అవకాశం తనకు రావటం అదృష్టంగా ఉందని అన్నారు ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు తమ శక్తి మేరకు సాగిస్తానని చెప్పారు
కార్యక్రమం లో నల్లగొండ జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ సిడి రవికుమార్, జిల్లా మాజీ RBS అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, బ్రాహ్మణ సంఘం నాయకులు పులి కృష్ణమూర్తి శర్మ, పుల్లభట్ల లక్ష్మీనారాయణ శర్మ, చిట్యాల శ్రీనివాస్ శర్మ నాయకులు పాలుట్ల బాబయ్య, అంగోతు హతీరామ్ నాయక్, పూల రవీందర్, కర్నాటి రమేష్, ముక్కపాటి వెంకటేశ్వర రావు, డైమండ్ శ్రీనివాస్, జాడి రాజు, కృష్ణా రెడ్డి, రామకృష్ణ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, మామిళ్ళ శ్రీనివాస్ రెడ్డి, నాయుడు, గోపాలకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు..