Ultimate magazine theme for WordPress.

దేశం ఎర్రజెండా వైపు చూస్తుంది… రంగారెడ్డి

Post top
home side top

బిజెపి పాలనలో కార్పొరేట్ శక్తులు ప్రజలను పీక తింటున్నారు
ఎనిమిదవ మండల మహాసభలు జూలకంటి
వేములపల్లి (ప్రజాలహరి) కార్పొరేట్ శక్తులు ప్రజల రక్తాన్ని తాగుతున్నారని, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఎనిమిదవ మండల మహాసభలో ఆయన మాట్లాడుతూ, సభ ప్రారంభంలో అమరులైన కమ్యూనిస్టుల నాయకులకు సంతాపం తెలియజేస్తూ జోహార్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కొంతమంది కమ్యూనిస్టు పార్టీ నాయకులను చులకన చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఇచ్చారు. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎర్రజెండాలతోని తిరుగుబాటు జరిగిందని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రపంచ ఎర్రజెండా విధానాలు అనుసరిస్తున్న దానికి సుముఖంగా ఉందన్నారు. అందుకు నిదర్శనంగా శ్రీలంకలో కమ్యూనిస్టు రాజ్యం రావడానికి ఒక ఉదాహరణ అని ఆయన కొనియాడారు. దేశంలో బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల ఆరు నెలలు కావలసిన దేశ అభివృద్ధి ఏమి జరగలేదు అన్నారు ప్రాంతీయ పార్టీల సహకారంతో అధికారంలోకి వచ్చింది కానీ, నైతికంగా బిజెపి పార్టీ ఓడిపోయినట్లే అని ఆయన ఎద్దేవా చేశారు. ఒక ఛాయ్ వాలా పేదవారి సంక్షేమం కోసం పాటుపడకుండా దాన్ని అంబానీ వంటి కార్పోరేట్ శక్తులకు దేశ సంపదను బంగారు పల్లయాల్లో పెట్టి అప్పగించడం మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం పరిస్థితి అని విమర్శించారు. ప్రజా సంక్షేమం మరిచి ఒకే పాలన, ఒకే భాష, ఓకే పన్నా అంటూ అవసరం లేని విషయాలపై దృష్టి సారించడం చాలా దురదృష్టకరమని అన్నారు. నేడు ప్రపంచంలో విజ్ఞానం పెరుగుతున్న సమయంలో మూడో విశ్వాసాలపై ప్రజలు దృష్టిని మార్చలేని విధంగా వ్యవహరించుతున్నారని ఆయన అన్నారు. ప్రజల మధ్యన అసమానతలు సృష్టించి ప్రాంతీయ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. రాబోయే కాలంలో ఇలాంటి శక్తులు ఎదుర్కోవడం కోసం సమరశీల పోరాటం సాగించాలని అది ఒక కమ్యూనిస్టులతో సాధ్యమవుతుందని అని అన్నారు. దేశంలో పార్టీలు ఎవరైనా వారి విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలేనని వాటికి ప్రత్యామ్నాయంగా సిపిఎం పార్టీ అందరికీ విద్య ,వైద్యం, కూడు, గూడు, గుడ్డ కావాలనుకునేది ఒక సిపిఎం పార్టీని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి పాదూరి శశిధర్ రెడ్డి, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారు మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, గౌతమ్ రెడ్డి, పా దూరి గోవర్ధన, పుట్టల సైదులు, మంగారెడ్డి, ఎస్ కే అయూబ్, పరశురాములు, సీతారాములు, చైతన్య, సత్తిరెడ్డి, ప్రణీత రెడ్డి తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.