నవంబర్ 1న వాడపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి కల్యాణోత్సవాలు జరుపబడును
మిర్యాలగూడ దామరచర్ల ప్రజాలహరి…….
👉తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం మన వాడపల్లి యందు ఉన్నది.
👉సాక్షాత్తు అగస్త్య మహాముని ప్రతిష్టించారని శాసనాల ద్వారా తెలుస్తుంది.
👉 జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు దర్శించి పూజించిన క్షేత్రం మన వాడపల్లి.
👉ఇక్ష్వాకులు,రాష్ట్రాకూటులు, బాదామి చాళుక్యులు,కల్యాణి చాళుక్యులు,కాకతీయులు,నవాబులు పరిపాలన చేసి పూజించిన క్షేత్రం మన వాడపల్లి.
ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో
దేవాదాయశాఖ మరియు స్వర్ణగిరి-యాదాద్రి తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలో తేదీ:1-11-2024,అమావాస్య, శుక్రవారం రోజున స్వామి వారి కల్యాణం చేయుటకు పండితులు నిర్ణయించారు.ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో భక్తులు అంతా పాల్గొని స్వామి వారి కల్యాణం వీక్షించి,తీర్ధ ప్రసాదాలు స్వీకరించి సకల శుభాలను పొందాలని మనవి.
గమనిక:మన ప్రాంత అభివృద్ధికి ఈ సందేశం,ఆహ్వాన పత్రిక,వీడియో కూడా మిత్రులకు పంపాల్సిన బాధ్యత మనదే.. కావున మన వాడపల్లి అభివృద్ధి సహకారం అందించాలని మనవి.
పూర్తి వివరాలకు :
పొదిల శ్రీనివాస్
గౌరవ చైర్మన్
శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం -వాడపల్లి
ఫోన్:9177179269
మరియు
శ్రీ కె.సిద్దయ్య గారు
సలహాదారు మరియు చైర్మన్
శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవాలయం-వాడపల్లి.
ఫోన్:9849839145.