నవంబర్ 1న దీపావళి పండుగ జరుపుకోవాలి… మిర్యాలగూడ పట్టణ బ్రహ్మశ్రీ, వేద ,జ్యోతిష్య పండితులు లక్ష్మీనారాయణ శర్మ ప్రకటన
దీపావళి పండుగను నవంబర్ ఒకటో తేదీన జరుపుకోవాలి …. మిర్యాలగూడ బ్రహ్మశ్రీ జ్యోతిష శాస్త్ర, వేద పండితులు పులాభట్ల లక్ష్మీనారాయణ శర్మ..
మిర్యాలగూడ ప్రజాలహరి.. నవంబర్ ఒకటో తేదీన దీపావళి పండుగను నిర్వహించుకోవాలని మిర్యాలగూడ కు చెందిన బ్రహ్మశ్రీ ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర మరియు వేద పండితులు పుల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మ పేర్కొన్నారు.. తిధులు వ్యత్యాసం వలన ఈ సమస్య ఏర్పడిందని చెప్పారు. అక్టోబర్ 30వ తేదీ న చతుర్దశి మధ్యాహ్నం 12 .35గంటల నుంచి ప్రారంభమైతున్న నేపథ్యంలో బుధవారం రాత్రి తెల్లవారుజామున(గురువారం సూర్యుడు ఉదయించే సమయంలో) నాలుగు గంటల నుంచి ఆరున్నర వరకు మంగళహారతులు పట్టుకోవాలని ,అదే రోజు సాయంత్రం లక్ష్మీ పూజలు, ధనలక్ష్మి పూజలు నిర్వహించుకోవాలని సూచనలు చేశారు .నవంబర్ 1వ తేదీ దీపావళి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. దీపావళి రోజున కేదారేశ్వర నోములు, మరియు కొత్త నోములు పట్టుకోవచ్చని చెప్పారు