కేటీఆర్ కేసులో సురేఖకు హైకోర్టు మొట్టికాయలు
మిర్యాలగూడ ప్రజాలహరి….మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి కొండా సురేఖపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది..
ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు తేల్చిచెప్పింది..
కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియాలో నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది..
కాగా, పరువు నష్టం కేసుకు సంబంధించిన ఓ కేసులో కోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి..