ప్రజాలహరి ..కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండుసార్లు కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నాం. సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్నారు. కానీ గత ముఖ్యమంత్రి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఏనాడు చేయలేదు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పా. తండ్రీకొడుకుల కొలువులు ఊడగొడ్తే.. మీకు కొలువులు వస్తున్నాయి. మా ప్రభుత్వ వచ్చాక విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం. ఏదో రకంగా నోటిఫికేషన్లు అడ్డుకోవాలని కుట్రలు చేశారు. -సీఎం రేవంత్ రెడ్డి
…,..
తెలంగాణ సమాజం మీద మీకెందుకంత కోపం. ఇకపై తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని బాధ్యతలేకుండా మాట్లాడుతున్నారు. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. ప్రభుత్వ స్కూళ్లకు పంపడానికి కొందరు నామోషీగా ఫీలవుతున్నారు. పేదోళ్లు తాళిబొట్టు తాకట్టుపెట్టి ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.21 వేల కోట్లు కేటాయించాం. ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 25 నియోజకవర్గాల్లో ఇప్పటికే పనులు మొదలయ్యాయి. -సీఎం రేవంత్ రెడ్డి