నేటి నుంచి మిర్యాలగూడకు సబ్ కలెక్టర్ హోదా అమలు బాధ్యతలు… స్వీకరించిన నూతన సబ్ కలెక్టర్ అమిత్ నారాయణన్…. మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.
మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గా అమిత్ నారాయణన్ బాధ్యతలు స్వీకరణ.. ఇప్పటివరకు రెవెన్యూ డివిజన్ ఉన్న మిర్యాలగూడకు సబ్ కలెక్టర్ హోదా పొందింది. రాష్ట్రవ్యాప్తంగా 14 రెవిన్యూ డివిజన్లను సబ్ కలెక్టర్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి మేరకు సబ్ కలెక్టర్లను నియమించింది. మిర్యాలగూడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పనిచేస్తున్న శ్రీనివాసరావు స్థానంలో నూతనంగా అమిత్ నారాయణన్ బాధ్యతలు స్వీకరణ తీసుకున్నారు. ఆయనకు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు గౌరవ వందనము స్వాగతం పలికారు. అదే విధంగా ఆయన ను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.