ప్రజాలహరి ….
వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం మార్గమధ్యలో సూర్యాపేటలో ఆగి, ఆ జిల్లాలో జరిగిన నష్టంపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూర్యాపేట కలెక్టరేట్ లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో పరిస్థితిని సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు.
ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెం దగ్గర దెబ్బ తిన్న రోడ్డు అక్కడి నుంచి పాలేరు – పాలేరు రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ ను, అక్కడ దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలైన రాజీవ్ గృహకల్ప కాలనీ, ఎఫ్సీఐ రోడ్డు, బొక్కలగడ్డ కాలనీ, పెద్ద తండా తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారినుద్దేశించి ప్రసంగించి భరోసానిచ్చారు.