ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయదల్చుకున్న వారందరూ కచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని పర్మిషన్
తీసుకోవాలని ఎస్ఐ నరేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో మండల పరిధిలోని పలు గ్రామాల పెద్ద మనుషులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఏడో తారీఖున జరిగే వినాయక చవితి పండుగకు గ్రామాలలో విగ్రహాల ఏర్పాటు చేయదలచిన వారందరూ ఒక్క అడుగు బొమ్మ
మొదలుకొని ఆపై బొమ్మలు పెట్టే వారందరూ ముందస్తుగా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకొని….. కమిటీ పేరు, మేనేజ్మెంట్ చేసే వారి పేరు ఆన్ లైన్ లో నమోదు చేసుకొని మైక్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకోనీ పోలీసు వారికి సహకరించాలని తెలిపారు. అలాగే పండగ మొదటి రోజు నుండి అన్ని గ్రామాలు విజిట్ చేయడం జరుగుతుందని… పర్మిషన్ తీసుకోకుండా విగ్రహాలు ఏర్పాటు చేసిన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ ఎస్ఐ ఉమాపతి, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, కానిస్టేబుల్స్ సైదులు, మోహన్, ఉష తదితరులు ఉన్నారు.