ఈ కేవైసీ నమోదు చేయడంలో వినియోగదారులుని ఇబ్బందులుకు గురిచేస్తున్న గ్యాస్ డీలర్లు… గ్యాస్ సిలిండర్ల డిస్ట్రిబ్యూషన్లో అవకతవకలు
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
గృహ వినియోగంలో గ్యాస్ యొక్క పాత్ర కీలకమైనది అటువంటి గ్యాస్ వినియోగదారులకు డిస్ట్రిబ్యూటర్లు సేవలు జట్టులమైనవి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ ఏజెన్సీలో చేయవలసిన కేవైసీలను సరైన రీతిలో చేయకుండా కస్టమర్లను ఇబ్బందులకు గురి చేస్తున్న యాజమాన్యాలు పట్టించుకోని అధికారులు వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చే సమయంలో తూకం చూసి లీకేజీలు లేకుండా చెక్ చేసి రసీదు ఇచ్చి రసీదు మీద నిర్ణయించబడిన ధరను వినియోగదారుడు నుండి వసూలు చేయవలసిన బాధ్యత డెలివరీ బాయ్ దగ్గర నుండి గ్యాస్ ఏజెన్సీల బాధ్యత కాగా ఇటువంటి నియమాలను ఏమి పాటించకుండా అత్యధిక ప్రమాదాలకు గ్యాస్ ఏజెన్సీలు బాధ్యులు అవుతున్న విషయాన్ని అధికారులు చూస్తూ కూడా పట్టించుకోకపోవడం గమనార్హం డెలివరీ ఇచ్చే వ్యక్తులు కనీస సూచనలను పాటించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు గ్యాస్ లీకేజీ చూయించకుండా మరియు తూకం వేయకుండా డెలివరీ ఇచ్చి వెళ్తున్నారు కానీ భద్రత విషయాన్ని పట్టించుకున్న నాథుడే లేడు అంతేకాకుండా వినియోగదారుడికి ఇవ్వవలసిన రసీదు ఇవ్వకుండా ఏజెన్సీ నిర్ణయించిన దానిపైన 50 నుంచి 80 రూపాయలకు వరకు అదనంగా వినియోగదారుల నుండి వసూలు చేస్తున్న వైనం ఇప్పటికైనా కలెక్టర్ స్థాయి అధికారులు వివిధ గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేసి నియమ నిబంధనలు పాటించే విధంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.