జాతీయ సమైక్యత ర్యాలీ… మిర్యాలగూడ ప్రజాలహరి
.
భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని మోడీ పిలుపుమేరకు ప్రజలు జాతీయ భావం జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ఈరోజు పెద్ద ఎత్తున జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.. పలువురు సామాజిక కార్యకర్తలు మరియు బిజెపి మరియు ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ కార్యకర్తలతో స్థానిక రాజీవ్ గాంధీ నుంచి ఫ్లైఓవర్ మీదుగా ఎన్ఎస్పి క్యాంప్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు జాతీయ భావన కలిగి ఉండాలని జాతి సమైక్యత కోసం అందరూ కృషి చేయాలని అందులో పాల్గొన్న వక్తలు పిలిపించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సత్యనారాయణ, బిజెపి పట్టణ అధ్యక్షులు కన్మంత రెడ్డి హనుమంత రెడ్డి, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ సాధినేని శ్రీనివాసరావు, మాజీ బిజెపి పట్టణ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, బంటు సైదులు, కొండేటి సరిత, ఎడ్ల రమేష్, ఫో రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , రవి ,చెరు పల్లి శ్యామ్, లక్ష్మారెడ్డి, అభి గజ్జల వెంకటరెడ్డి, బొడ్డుపల్లి రమేష్ పాల్గొన్నారు