మిర్యాలగూడ ప్రజాలహరి
శ్రీ జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్, ఆదేశాల మేరకు గంజాయి సరఫరా మరియు గంజాయి సేవిస్తున్నవారిపై మిర్యాలగూడ పట్టణ పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగినదనీ మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు. ఇట్టి గంజాయి నిర్మూలనలో భాగంగా ఇప్పటివరకు మిర్యాలగూడ పరిధిలో (35) మంది గంజాయి సరఫరా దారులను పట్టుబడి చేసి వారినుండి (153) కేజీల గంజాయిని స్వాదీనపర్చుకొనైనది మరియు (5) కేసులు నమోదు చేసి నిందితులను రిమాండుకు పంపించడం జరిగినదనీ
మరోవైపు గంజాయి సరఫరా దారులు మరియు గంజాయి సేవిస్తున్న వారిలో మార్పు కొరకు గాను శ్రీ జిల్లా యస్.పి గారు “ మిషన్ పరివర్తన్ ” పేరుతో కౌన్సిలింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినారు. అందులో భాగంగా తేదీ 30-07-2024 రోజున (25) మందిని వారి సంరక్షకులతో యుక్తంగా నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్ కు పంపించి కౌన్సిలింగ్ ఇప్పించడ జరిగినది. ఇట్టి కౌన్సిలింగ్ ప్రభావాన్ని తెలుసుకోవడానికి గాను ఈరోజున ఆకస్మిక తనిఖీలో భాగంగా ఇద్దరు కౌన్సిలింగ్ తీసుకున్న వారిని మరియు ఇద్దరు అనుమానితులను “ Multi Drug One Step Test Device” ద్వారా తనిఖీ చేయగా అందులో ఇద్దరు కౌన్సిలింగ్ తీసుకున్నవారికి “నెగెటివ్“ రిపోర్ట్ రాగా మరో ఇద్దరు కౌన్సిలింగ్ తీసుకోని అనుమానితులకు “పాజిటివ్” రిపోర్ట్ వచ్చినది, వారు ఈమద్య కాలంలో గంజాయి సేవించినట్లు రుజువు అయినది. జిల్లా ఎస్.పి గారి ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ తీసుకున్న వారిపై నిఘా కొనసాగిస్తూ వారు చెడుమార్గంలో మళ్ళకుండా చూసుకోవడంతో పాటు కొత్తగా మాధక ద్రవ్యాలు సేవించినట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన హౌసింగ్ బోర్డు మరియు చర్చ్ రోడ్డు కు చెందిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది.
పోలీసు శాఖ వారివద్ద విరివిగా అందుబాటులో ఉన్న“ Multi Drug One Step Test Device” ద్వారా అనుమానితులపై అకస్మాత్ పరీక్షలు నిర్వహించి మాదక ద్రవ్యాలు సేవించినట్లుగా రిపోర్ట్ వచ్చిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోబడుననీ వివరించారు